Mahesh Babu Birth day Special Story: ఎన్నటికీ తరగని అందం అతడి సొంతం. నటనకు అరడుగుల రూపం. బాక్సాఫీస్ బాద్ షా.. అమ్మాయిల కలల రాకుమారుడు...సేవల్లో సూపర్ స్టార్... అభిమానుల గుండెల్లో అతడొక 'పోకిరి'. సరిలేరు అతడెకవ్వరూ... ఆయనే ప్రిన్స్ మహేష్. ఇవాళ (ఆగస్ట్ 9) మహేశ్ బాబు పుట్టిన రోజు (Happy Birthday Mahesh Babu). ఆయన జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాల నటుడిగా..
సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు 1975 ఆగస్టు 9న చెన్నైలో జన్మించారు మహేష్ బాబు. స్కూలింగ్ మెుత్తం తమిళనాడులోనే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోలు కార్తీ, దళపతి విజయ్ లు మహేష్ క్లాస్ మేట్స్. తండ్రి ప్రభావంతో బాలనటుడిగా తెరగ్రేటం చేశారు మహేశ్ బాబు.  తన అన్న రమేశ్ బాబుకో కలిసి తొలిసారి 'నీడ'’ (Needa) చిత్రంతో మెుదటిసారిగా వెండితెరపై కనిపించారు.  పోరాటం సినిమాతో బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. ఎనిమిదికి పైగా చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. 


హీరోగా ఎంట్రీ...
రాజకుమారుడు సినిమాతో మహేశ్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేశ్...తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఒక్కడు సినిమాతో టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన మహేశ్... తర్వాత పోకిరి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. దూకుడు, శ్రీమంతడు చిత్రాలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టడమే కాకుండా..నటుడిగా మరింత ఎత్తుకు ఎదిగాడు. తానే నిర్మాతగా మారి సినిమాలు తీయడం మెుదలుపెట్టారు మహేశ్. రీసెంట్ గా మహేశ్ బ్యానర్లో వచ్చిన మేజర్ అద్భుతమైన విజయం సాధించింది.


అవార్డుల్లో కూడా ముందే...
మెదటి చిత్రం రాజకుమారుడుతోనే నంది అవార్డు అందుకున్నారు మహేశ్. ఆ తర్వాత 2003లో వచ్చిన నిజం సినిమాకు తొలిసారి ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత 2005 లో అతడు, 2011లో దూకుడు, 2015 లో శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నారు సూపర్ స్టార్. 


సేవ కార్యక్రమాల్లో భేష్...
సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో మహేశ్ ఒకరు. అంతేకాకుండా పలు కంపెనీలకు మహేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ భారీగా సంపాదిస్తున్నారు. మహేశ్ తన సంపాదనలో 30 శాతానికిపైగా వివిధ సేవ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.  ఎంతో మంది చిన్నారులకు హార్ట్ అపరేషన్ కు సహాయం చేసి వారి ప్రాణాలు నిలబెట్టారు సూపర్ స్టార్. అంతేకాకుండా ఆయన ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. 


పర్సనల్ లైఫ్..
వంశీ సినిమా సమయంలో మాజీ మిస్ ఇండియా, హీరోయిన్ నమ్రతతో ప్రేమలో పడ్డారు మహేశ్. అనంతరం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు గౌతమ్, సితార లు సంతానం. గౌతమ్ ఇప్పటికే 'వన్ నేనొక్కడినే' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలకు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది జీ తెలుగు న్యూస్.


Also Read: Tollywood: కోట్లలో బింబిసార లాభాలు.. సీతారామం బ్రేక్ ఈవెన్ కు కొద్ది దూరంలో.. వసూళ్ల వివరాలివే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook