న్యూఢిల్లీ: tiktokలో పాపులారిటీ రావడంతో టిక్‌ టాక్ స్టార్ ను హత్య చేసిన సంఘటన హర్యానాలోని సోనిపాట్ ప్రాంతం కుండ్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార బ్యూటీషియన్ శివాని(20) తన సోదరి, నీరజ్‌తో కలిసి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. శివాని టిక్‌టాక్ వీడియోలు చేయడంతో ఆమెకు లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆరిఫ్ మహ్మాద్ అనే వ్యక్తి శివాని కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ tiktok‌లో వచ్చిన పాపులారిటీని చూసి ఆమెపై అసూయ పెంచుకున్నాడు.  Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: అమెజాన్ పే, పేటీఎంకు దీటుగా మరో యాప్..


కాగా శుక్రవారం సాయంత్రం శివాని ఒంటరిగా ఉన్నప్పుడు ఆరిఫ్ బ్యూటీ పార్లర్‌లోకి చొరబడి శివాని గొంతుకు దుప్పెట చుట్టి హత్య చేశాడు. బెడ్ కింద మృతదేహాన్ని దాచిపెట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటిరోజు బ్యూటీ పార్లర్ లో ఓ గది నుంచి వాసన రావడంతో బెడ్ కింద మృతదేహం కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆరిఫ్‌పై అనుమానాలు ఉన్నాయని శివాని కుటుంబ సభ్యులు తెలపడంతో అతడిని కస్టడీలోకి తీసుకోగా పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 


 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 


Also Read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్