అమెజాన్ పే, పేటీఎంకు దీటుగా మరో యాప్..

ఇండియా‌లో వర్చువల్‌ మనీ వాలెట్స్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా 'స్విగ్గీ మనీ' (Swiggy Money)పేరుతో డిజిటల్‌ వాలెట్‌ను విడుదల చేసింది.

Updated: Jun 30, 2020, 04:34 PM IST
అమెజాన్ పే, పేటీఎంకు దీటుగా మరో యాప్..

హైదరాబాద్: ఇండియా‌లో వర్చువల్‌ మనీ వాలెట్స్‌కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని దేశీయ అతిపెద్ద ఫుడ్‌డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా 'స్విగ్గీ మనీ' (Swiggy Money)పేరుతో డిజిటల్‌ వాలెట్‌ను విడుదల చేసింది. ఐసీఐసీఐ (ICICI)బ్యాంక్‌తో క‌లిసి స్విగ్గీ మ‌నీ పేరుతో వాలెట్‌ను తీసుకొచ్చింది. హోటల్‌, రెస్టారెంట్ల ఆర్డర్ల కోసం ప్రత్యేకంగా స్విగ్గీ మనీ రూపొందించింది. (Amazon PAY, PAYTM) అమెజాన్‌ పే, పేటీఎం, ఫోన్‌పే తదితర డిజిటల్‌ వాలెట్లకు స్విగ్గీ మనీ గట్టిపోటీనిస్తుందని కంపెనీ భావిస్తోంది. స్విగ్గీ యాప్‌ ఉన్న వినియోగదారులు ఫుడ్‌ ఆర్డర్‌ చేసే ముందు ఇకపై ఒక్కక్లిక్‌తో చెల్లింపులు చేయొచ్చని సూచిస్తోంది.  Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )

Also Read: Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్

ఇకముందు స్విగ్గీ వినియోగదారులు మనీ యాప్ లో నగదు జమ చేసుకొని ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకొవచ్చని పేర్కొంది. స్విగ్గీ వినియోగదారులకు ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతా ఉన్నట్లైతే వారు తక్షణమే వాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాలేని వారు కూడా ఏదైనా ప్రభుత్వ ఐడీకార్డు వివరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు అందించడం ద్వారా వెంటనే వాలెట్‌ను వినియోగించుకునే వీలుంటుందని, స్విగ్గీ మనీ ద్వారా యూజర్లు ఇన్‌స్టాంట్‌ రిఫండ్లను సైతం పొందవచ్చని వెల్లడించింది. 
 జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..