మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు(Sarileru Neekevvaru) ప్రస్తుతం టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తోన్న చిత్రాల్లో ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన పాటలు, సినిమా టీజర్‌కి(Sarileru Neekevvaru teaser) అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించగా తాజాగా.. హీ ఈజ్ సో క్యూట్ అనే రొమాంటిక్ సాంగ్‌ను సైతం మేకర్స్ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లామర్, హ్యాండ్సమ్ పర్సనాలిటీకి తగినట్టుగానే ''హీ ఈజ్ సో క్యూట్... '' అనే లిరిక్స్‌తో రాసిన ఈ పాటకు ఆడియెన్స్ నుంచి, అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. శ్రీమణి రాసిన పాటకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా యువ గాయని మధుప్రియ ఈ పాటను పాడింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. హీ ఈజ్ సో క్యూట్ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తుండగా.. జి మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Read also : ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ వేడుక


సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు ఓ ఆర్మీ ఆఫీసర్ పాత్రను పోషిస్తుండగా.. రష్మిక మంధన, విజయశాంతి, ప్రకాష్ రాజ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్స్ జనవరి 5న జరగనున్న సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.