Premikudu Movie: నగ్నంగా నేలపై యంగ్ హీరో.. `ప్రేమికుడు` అంటూ డిఫరెంట్ లుక్
Premikudu First Look Poster: ప్రేమికుడు అంటూ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను అలరించనున్నాడు హీరో పండు చిరుమామిళ్ల. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా.. నేలపై నగ్నంగా హీరో పడుకుని ఉండడంతో ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు.
Premikudu First Look Poster: ప్రేమ అనేది ఓ సముద్రం.. లవ్‌పై ఎన్ని కథలు వచ్చినా.. దేనికి అవే ప్రత్యేకత. లవ్ బేస్డ్ మూవీ అంటే యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ప్రేమలోని సంఘర్షణను చూపిస్తూ.. ఎమోషన్స్‌ను చక్కగా క్యారీ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం పక్కా. ఇటీవల రా అండ్ రాస్టిక్ సినిమాలకు యూత్ బ్రహ్మరథం పడుతున్నారు. నేటి తరం ఆలోచనకు తగినట్లు.. సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ.. రా అండ్ బోల్డ్ మెరుపులతో యూత్‌ఫుల్ లవ్ రొమాంటిక్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేమికుడు అనే మూవీ తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో పండు చిరుమామిళ్ల హీరోగా నటిస్తుండగా.. రామ్ వెలుగు దర్శకత్వం వహిస్తున్నారు. గురుదేవ్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి హీరో పండు చిరుమామిళ్ల ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌తోనే ఎంతో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. హీరో నేలపై నగ్నంగా పడుకుని.. నోట్లో సిగరేట్.. చేతికి సంకేళ్లతో ఉన్నాడు. శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లోనే ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
ప్రేమకుడు చిత్రానికి అన్‌ఫిల్టర్డ్ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. ఆదిత్య లొల్ల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. చీదెళ్ల నాగార్జున రచయితగా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
టెక్నికల్ టీమ్
==> బ్యానర్: గురుదేవ్ స్టోరీ టెల్లర్స్
==> నిర్మాతలు - రామ్ యాదవ్ గొట్టె, చెరుకూరి సాయి కుమార్
==> దర్శకుడు: రామ్ వెలుగు
==> DOP - ఆదిత్య లోల్ల
==> రచయిత: చీదెళ్ల నాగార్జున
==> పోస్టర్ డిజైనర్: గౌతమ్ అంబటి
==> PRO: సాయి సతీష్
Also Read: Allu Arjun: పుష్పరాజ్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.