Telangana Sarvapindi Recipe: తెలంగాణ స్టైల్ సర్వపిండి..చలికాలంలో ఇలా చేసుకుని తింటే..వాహ్హ్ అనాల్సిందే

 Telangana Sarvapindi Recipe: ఎప్పుడైనా సర్వపిండి తిన్నారా. అయితే ఈ స్టైల్లో ఓసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తెలంగాణ స్టైల్ సర్వపిండి ఓ సారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ వేరే లెవల్ అంతే . 

1 /8

 Telangana Sarvapindi Recipe: సర్వపిండి..అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. సాయంత్రం సర్వపిండి తింటుంటే ఆ మజానే వేరుంటంది. కాలం ఏదైనా సరే స్నాక్ లా సర్వపిండి భలే ఉంటుంది. అంతేకాదు ఇది తెలంగాణలో చాలా ఫేమస్. కొన్ని ప్రాంతాల్లో దీన్ని సర్వప్ప, గిన్నెపిండి, తపాలా చెక్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.   

2 /8

చలికాలంలో వేడివేడిగా చేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇకనాన్ వెజ్ కాంబినేషన్ తో తింటే ఆహా ఆ రచి మాటల్లో చెప్పలేము. అయితే ఈ సారి సర్వపిండి ఈ స్టైయిల్లో ప్రిపేర్ చేయండి. 

3 /8

కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి - 3 కప్పులు, పచ్చిశనగపప్పు - 2 టేబుల్​స్పూన్లు, పల్లీలు - పావు కప్పు, జీలకర్ర - ముప్పావు చెంచా, కారం - 1 టీస్పూన్, పచ్చిమిర్చి - 3, నువ్వులు - 1 టేబుల్​స్పూన్, కొత్తిమీర తరుగు - 1 టేబుల్​స్పూన్, పుదీనా తరుగు - 1 టేబుల్​స్పూన్, ఉప్పు - రుచికి సరిపడనంతా తీసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్, కరివేపాకు - 1 రెమ్మ తీసుకోవాలి  

4 /8

తయారీ విధానం: ముందుగా వేరుశనగపప్పును 1గంటపాటు నానబెట్టాలి. అలోపు అందులోకి కావాల్సిన పదార్థాలన్నింటిని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. పల్లీలను వేయించుకుని పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచుకుని పక్కన పెట్టాలి. పచ్చిమిర్చి, పుదీన, కరివేపా సన్నగా తరుగుకోవాలి.   

5 /8

ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి వేసి అందులో పల్లీలు, జీలకర్ర, కారం, నువ్వులు, పచ్చిమిర్చి, కొత్తీమీర, పుదీనా, కరివేపాకు, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసుకుని అన్ని కలపాలి.   

6 /8

అందులో నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. గంటపాటు నానబెట్టి..శనగపప్పును వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చిలకరించుకుంటూ గట్టిగా చేతితో వత్తుకోవాలి. 

7 /8

మందంగా ఉన్న పాన్ తీసుకుని దాని లోపల కొద్దిగా నూనె అప్లయ్ చేసుకోవాలి. ఇలానూనె వేస్తే పిండి పాన్ కు అతుక్కోది. పిండి ముద్దను తీసుకుని పాన్ లో అన్ని వైపులా సమానంగా చేతితో గుండ్రంగా పల్చగా వచ్చటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి. మరీపల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేవిధంగా పాన్ లో వత్తుకోవాలి.   

8 /8

దానిపై చిన్న చిన్నరంధ్రాలు చేసుకోవాలి. టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. మూతపెట్టి 12 నుంచి 15 నిమిషాలపాటు కాలనివ్వాలి. సర్వపిండి చక్కగా ఉడుకుతుంది. అంతే సర్వపిండి రెడీ