Amit Shah Flight Emergency Landing: గువహటి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బార్డొలి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బుధవారం రాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాస్తవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అగర్తలా వెళ్లాల్సి ఉండగా.. అగర్తలాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం అస్సాం రాజధాని గువహటిలోనే అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగర్తలాలో వాతావరణం అనుకూలించకపోవడంతో సిబ్బంది తొలుత కొంత ఆందోళనకు గురైనప్పటికీ.. విమానం గువహటిలో సురక్షితంగా రన్‌వేపే ల్యాండ్ అవడంతో అంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.


అనుకోని అతిథిగా వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోసం అక్కడి ప్రభుత్వం గువహటిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేసింది. బుధవారం రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసి గురువారం ఉదయం అక్కడి నుంచి అగర్తలాకు వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారమే గురువారం ఉదయం అగర్తలాలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రథ యాత్రను ప్రారంభించనున్నారు. అనంతరం అమిత్ షా తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.


ఇది కూడా చదవండి : Amul Franchise Investment: అమూల్ ఫ్రాంఛైజీతో భారీ లాభాలు.. 2 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 5 లక్షల వరకు లాభం


ఇది కూడా చదవండి : Flipkart vs Customer: ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ రాలేదు కానీ డబ్బులు కట్ అయ్యాయి.. కస్టమర్ కేర్ రెస్పాన్స్ లేదు.. చివరకు ఏం జరిగిందంటే..


ఇది కూడా చదవండి : SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook