Honey reduce belly fat In 5 Days: వివిధ కారణాల వల్ల బరువు పెరిగిన వారు.. బరువు తగ్గడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మార్కెట్‌లో లభించే వివిధ రకాల మెడిసిన్ వాడడం, జిమ్, యోగాలు చేయడం వంటి ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. అయితే వీటి కారణాల వల్ల పలు రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ బారిన పడుతున్నారు. అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటించి కూడా పొట్ట చుట్టూ బరువును నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా క్రమం తప్పకుండా తేనెను వినియోగించడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా పొట్టు కొవ్వు నియంత్రణలో ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బరువు తగ్గడానికి ఇలా తేనెను తీసుకోండి:


>> ప్రతి రోజూ ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని.. ఖాళీ కడుపుతో తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకు పోయిన కొవ్వు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.


>> క్రమం తప్పకుండా ఉదయం పూట ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మకాయ, జీలకర్ర పొడి కలిపి తాగితే.. బరువు సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


>> స్త్రీలు  పీరియడ్స్ సమయంలో వివిధ రకాల సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు పాలు, తేనె తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం గోరువెచ్చని పాలలో తేనె కలుపుకుని తాగాలని నిపుణులు పేర్కొన్నారు.


>> శరీర బరువు తగ్గడానికి పాలు, తేనె ప్రభావవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా పాలు, తేనెను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తలనొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


>> ముఖంపై ముడతలను, జీర్ణశక్తి  బలంగా చేయడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. కావున శరీర సమస్యలతో బాధపడే వారు రోజూ పాలలో తేనె కలుపుకుని తాగాలని చెబుతున్నారు.


>> పాలు, తేనె మిక్స్‌ చేసి తాగడం వల్ల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలలో బాధపడుతున్న వారు తప్పకుండా పాలతో తేనెను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవ


Also Read: Horoscope Today July 25 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారు ఊహించని శుభవార్త వింటారు!   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.