Hyderabad Metro Ticket Offers: హైదరాబాద్ మెట్రో ప్రయాణిలకు గుడ్‌న్యూస్. ఉగాది 2024 ఉత్సవాలు హైదరాబాద్‌కు ఆనందోత్సవాలను తీసుకువస్తున్న వేళ ఎల్ ‌అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ తమ ప్రయాణికుల కోసం ఆకర్షణీయమైన  కార్యక్రమాలను ప్రకటించింది. అపూర్వమైన  ప్రజా స్పందన ఆధారంగా హెచ్ఎంఆర్ ప్యాసింజర్ ఆఫర్‌లను మరో 6 నెలల వరకు పొడిగించింది. సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్‌ను మరో ఆరు నెలలపాటు ప్రయాణికులు వినియోగించుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Mega Brothers One Frame: మెగా బ్రదర్స్‌ అరుదైన కలయిక.. 'విశ్వంభరుడే' కలిపాడా?


హెచ్ఎంఆర్ఎల్  మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. తక్కువ ధరలో ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి హెచ్ఎంఆర్  హైదరాబాద్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ ఆఫర్‌ తేదీని మరో ఆరు నెలలపాటు పొడగించడంతో మెట్రో ప్రయాణాన్ని మరింతగా  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఎల్‌ అండ్ టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ సరికొత్త  కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేస్తోందని వెల్లడించారు.


సరికొత్త కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించామన్నారు. తరచుగా మెట్రోలో  ప్రయాణించే వారికి పూర్తి ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. దీని ద్వారా ఎంత ఎక్కువగా మెట్రో సేవలు వినియోగించుకుంటే  అంత ఎక్కువ రివార్డులు పొందవచ్చని తెలిపారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ప్రత్యేకమైన కస్టమర్ లాయల్టీ స్టాల్ ఓపెన్‌లో ఉంటుందన్నారు. ఇక్కడ అర్హత కలిగిన ప్రయాణికులు తమ రివార్డ్‌లను క్లెయిమ్ చేయవచ్చన్నారు.
 
ఎల్‌ అండ్ టీఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్  ఎండీ, సీఈఓ కేవీబీ  రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభించిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ద్వారా తమ ప్రయాణికులకు  కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ ఆఫర్లతో హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. 


కాగా.. ఇటీవల 59 కార్డును రద్దు చేసిన విషయం తెలిసిందే. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అర్ధాంతరంగా ఇలా రద్దు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రయాణిస్తే టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీని కూడా రద్దు చేయగా.. ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. నిత్యం హైదరాబాద్‌ మెట్రోలో దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ ఎండల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. 


Also Read:  PM Modi Fan Cut His Finger:మోదీ హ్యట్రిక్ పీఎం కావాలి.. వేలుకోసుకొని కాళీకా దేవికి అర్పించిన అభిమాని.. ఎక్కడంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook