అమ్మాయి మరీ సన్నగా ఉంది.. అమ్మాయి బొద్దుగా తయారైంది. .. ఇలాంటి మాటలు వినీవిని బోర్ కొట్టిందంటోంది టాలీవుడ్ భామ శ్రుతి హసన్. వేరే వాళ్లను జడ్జ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదని చెబుతోంది. శరీరంలో వచ్చే మార్పులను అందరూ తప్పకుండా స్వాగతించాలని కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా మహిళలు..హర్మోన్ల సమస్య  కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. తాను కూడా హార్మోన్ సమస్యలతో శారీరకంగా, మానసికంగా బాధపడుతున్నానని చెప్పింది. అందుకే తన శరీరంలో మార్పులు వస్తున్నాయని తెలిపింది. కానీ బొద్దుగా ఉన్నా.. సన్నగా ఉన్నా పెద్దగా తేడా ఉందని ..బాడీ షేమింగ్ చేసే వాళ్లకు కౌంటర్ ఇచ్చింది శ్రుతి. ఇదే సందర్భంలో గతంలో తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాననే విషయం బయటపెట్టింది. ఇందుకు సంబంధించి మూడు రోజుల వ్యవధిలో తీసిన రెండు ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 


[[{"fid":"182581","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి హసన్ ప్రస్తుతం తెలుగులో రవితేజ సరసన నటిస్తోంది. రవితేజ హీరోగా వస్తున్న 'క్రాక్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.