ఇదేం లైఫ్‌రా... నేటి సగటు బ్యాచిలర్ లైఫ్ స్టైల్‌పై పాట !
అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు ఫేమ్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కాంబోలో మిఠాయి మూవీ
అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో తమదైన స్టైల్లో కామెడి పండించి ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి. ఈ ఇద్దరు నటులు ప్రధాన పాత్రల్లో మిఠాయి అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రెండ్ యాంట్స్ బ్యానర్‌పై డా ప్రభాత్ కుమార్ నిర్మిస్తున్నాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ 'ఇదేం లైఫ్‌రా' అనే పాటను విడుదల చేశారు. నేటి సగటు యువత లైఫ్ స్టైల్‌పై కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటను శ్రావ్య కొత్తలంక పాడారు.