తీసింది రెండు సినిమాలే అయినా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్.. లాక్‌డౌన్ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాడు. థియేటర్లకు జనాలను వెంటనే రప్పించుకోవాల్సి వస్తే మద్యం సరఫరా చేసే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. భారత్‌లో అతడే బెస్ట్ ఫీల్డర్: కోహ్లీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విదేశాల తరహాలో బీర్, బ్రీజర్, వైన్ అమ్మకాలకు థియేటర్లకు అనుమతి లభిస్తే ప్రయోజనం ఉంటుందన్నాడు. కనీసం వాటితోనైనా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించవచ్చునేమోనని ట్వీట్ చేశాడు. ఓసారి ఇదే విషయమై నిర్మాత సురేష్ బాబు, హీరో రానా దగ్గుబాటితో చర్చించానని ట్వీట్‌లో పేర్కొన్నాడు నాగ్ అశ్విన్. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఫొటోలు



థియేటర్లలో మద్యం అమ్మకాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కోల్పోయే ప్రమాదం సైతం ఉంది. అయితే అన్ని థియేటర్లలో కాకుండా కొన్ని మల్టీప్లెక్స్ హాల్స్‌లో అనుమతి ఇస్తేనైనా జనాలను లాక్‌డౌన్ తర్వాత థియేటర్లకు తీసుకురావచ్చునని ట్వీట్ చేశాడు. మీ అభిప్రాయం ఏంటో చెప్పాలని నెటిజన్లను ఈ దర్శకుడు అడిగారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు