Share Market: ప్రతి ఒక్కరూ సంపాదించాలనే ఉద్దేశంతో షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. స్టాక్ మార్కెట్‌లో మీ ఆదాయం ఏ క్షణంలోనైనా పెరగవచ్చు. ఒక్కొసారి నష్టాలు కూడా రావచ్చు. ఇక్కడ రిస్క్ చాలా ఎక్కువగా ఉన్నందున మార్కెట్‌లో డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. మీరు స్టాక్ మార్కెట్ నుంచి వ్యూహం ప్రకారం పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు తెచ్చుకోవచ్చు. జీతం కాకుండా అదనపు ఆదాయం సంపాదించాలని ఉంటే.. షేర్ మార్కెట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సంపాదన వ్యూహం ఇలా..


ప్రతి ఒక్కరూ అదనపు ఆదాయాన్ని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా.. లాభాల రూపంలో  అధిక ఆదాయాన్ని పొందవచ్చు. జీతం కాకుండా.. ప్రతి నెలా 30 వేల రూపాయలు అవసరమైతే అదనపు ఆదాయం రూపంలో ఒక వ్యూహాన్ని అనుసరించాలి. ఈ వ్యూహం స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సంబంధించినది.


నెలలోని 30 రోజుల్లో శని, ఆదివారాల్లో స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ ఉండదు. ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్‌కి సెలవు. మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి 22 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సెలవుల కూడా తీసేస్తే.. స్టాక్ మార్కెట్‌లో వ్యాపారం చేయడానికి నెలకు కనీసం 20 రోజులు ఉంటుంది.


అదనపు ఆదాయం ఇలాగే ఉంటుంది


ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో 20 రోజుల ట్రేడింగ్ ఉండి.. నెలలో రూ.30 వేలు సంపాదించాలంటే ఈ డబ్బును 20 రోజుల్లో విభజించాలి. ఆ తర్వాత ఒక పని దినానికి రూ.1500 వస్తుంది. అంటే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు సగటున రోజుకు రూ.1500 సంపాదించాలి. మీరు ట్రేడింగ్ ద్వారా సగటున రూ.1500 సంపాదిస్తే.. నెలాఖరులో మీరు రూ.30 వేలు అదనంగా సంపాదించవచ్చు.


అదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు.. డబ్బు పెట్టుబడి పెట్టే షేర్లకు, పెట్టుబడి పెట్టే మొత్తానికి చాలా తేడా ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు.. మార్కెట్ ఏ దిశలో వెళుతుందో కూడా గమనిస్తూ ఉండాలి. ట్రేడింగ్‌లో దురాశ కూడా చాలా సార్లు హాని కలిగిస్తుంది. నెల లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సగటు రోజువారీ ఆదాయాలపై ఒక కన్ను వేసి ఉంచండి.


Also Read: TS Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. శాఖల వారీగా భర్తీ చేసే పోస్టులు ఇవే..  


Also Read: Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ టీమ్.. సర్వత్రా ఉత్కంఠ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook