సినిమాలకు సమంత గుడ్ బై చెబుతుందా ?
ప్రస్తుతం ఈ వార్త హల్ చల్ చేస్తోంది. సినిమాలను ఇప్పట్లో ఆపేయాలనే ఆలోచన తనకు లేదని పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సమంత..అయితే ఏడాది తర్వాత ఆమె సినిమాలకు దూరమవబోతోందంటూ కొత్త వార్త తెరపైకి రావడం చర్చనీయంశంగా మారింది.
పెళ్లి తర్వాత సమంత కూడా రంగస్థలం, రాజుగారి గది 2 సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమంత..భర్త నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇంకా ఆఫర్లు వచ్చిపడుతున్నప్పటికీ కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదట అక్కినేనివారి కోడలు.
దీంతో దక్షిణాది అగ్ర సినీ నటి సమంత సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్త షికార్లు కొడుతోంది. 2019 మార్చి కల్లా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో సమంత ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.