శ్రీమంతుడు హిట్ తరువాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రంలో సీఎం పాత్రలో మహేష్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే..! 'చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలో అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా' అంటూ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ 'భరత్ అనే నేను' సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలావుంది. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై సైతం భారీ అంచనాలున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇప్పుడు ఈ టీజర్ వైరల్ అయ్యింది. ఇందులో భరత్ రామ్ ముఖ్యమంత్రి అని పేర్కొనే నేమ్ బోర్డు ఉండే షాట్ ఒకటుంది. ఇప్పుడు ఆ సీన్‌ని ఎడిట్ చేసి కొందరు అభిమానులు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా ఆ షాట్‌‌ ఉన్న ఫోటోని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ఎడిట్ చేసి పవన్ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా.. ఇప్పుడు రాజకీయాలవైపే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో  ఆయన ఇప్పట్లో సినిమా చేసే ఆలోచనలో లేరని తెలిసిపోయింది. తన కోసం కథలు సిద్ధం చేసుకున్న దర్శకులకు ఆ కథలను వేరే హీరోలకి కథలుగా చెప్పని, అ కథ నచ్చితే వారితో సినిమా చేయమని పవన్ అన్నారని ఇండస్ట్రీలో టాక్.   


అలానే మహేష్‌కి బదులుగా ఎన్టీఆర్ ఫోటో పెట్టి అందులో తారక్ రామ్ సీఎం అని ఎడిట్ చేసి, ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు కొందరు ఎన్టీఆర్ అభిమానులు.  న్టీఆర్ ఎప్పటికైనా సీఎం అవుతాడని.. కామెంట్స్ చేస్తూ సంబరపడిపోతున్నారు.  ప్రస్తుతం పవన్, ఎన్టీఆర్..అలానే జగన్  ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.