జూ.ఎన్టీఆర్  మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. కాగా తన రెండో కుమారుడికి ఈ రోజు నాకమారణం చేశారు. యంగ్ టైగర్  ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. పెద్ద కుమారుడికి అభయ్‌రామ్‌గా పేరు పెట్టిన ఎన్టీఆర్... తన రెండో కుమారుడికి భార్గవ్ రామ్ అని నామకరణం చేసినట్టుగా ఇన్‌స్టాగ్రాం ద్వారా ప్రకటించాడు.


జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఈ చిన్నోడి పేరు భార్గవ్‌ రామ్‌’ అని పేర్కొంటూ నామకరణ మహోత్సవం, ఫ్యామిలీ టైమ్‌ అన్న హ్యాష్‌ట్యాగ్స్‌ ఇచ్చారు.  జూ ఎన్టీఆర్ దంపతులు, అభయ్ లు  భార్గవ్‌ని ఆప్యాయంగా చూస్తున్న ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.