వెనక్కి తగ్గిన కాజల్ అగర్వాల్
వెనక్కి తగ్గిన కాజల్ అగర్వాల్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, చందమామ, మగధీర వంటి సినిమాలతో టాలీవుడ్ హీరోయిన్గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ నిర్మాతగా మారనున్నట్టు ఆమధ్య ఓ టాక్ వినిపించింది. కేఏ వెంచర్స్ పేరుతో తన పేరు కలిసొచ్చేలా ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన కాజల్ అగర్వాల్.. ప్రశాంత్ వర్మ కానీ లేదా తన గురువు తేజ దర్శకత్వంలో కానీ ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటోందనేది ఆ టాక్ సారాంశం.
అయితే, ఇటీవల వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం కాజల్ అగర్వాల్ చిత్ర నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టొద్దని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. నటిగా బిజీగా ఉంటూ చిత్ర నిర్మాణంపై దృష్టి సారించలేకపోతే నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని కాజల్ అగర్వాల్ కుటుంబసభ్యులే ఆమెకు హితబోధ చేశారట. కుటుంబసభ్యుల సలహాతో చిత్ర నిర్మాతగా మారాలనే ఆలోచనను కాజల్ విరమించుకున్నట్టు సమాచారం. ఏదేమైనా కాజల్ అగర్వాల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బంగారు నగల వ్యాపారం వంటి ఇతర వ్యాపారాలను చూసుకుంటూ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తోంది అది వేరే విషయం.