హైదరాబాద్‌: కాజల్‌ అగర్వాల్‌ ఈమధ్య ఎక్కడికెళ్లినా ఆమెకు ఎదురవుతున్న ప్రశ్న ఒక్కటే. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు, ఎవరిని చేసుకుంటున్నావు అని కాజల్‌ అగర్వాల్ ని విసిగించేస్తున్నారు. దీంతో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్‌ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతానికి తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని స్పష్టంచేసింది. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే, సినీ పరిశ్రమకు చెందిన వారిని మాత్రం చేసుకోబోనని కాజల్ అగర్వాల్ తేల్చిచెప్పింది. తనకు సినీ పరిశ్రమలో ఎందరో స్నేహితులు ఉన్నారు కానీ వాళ్లలో ఎవ్వరినీ జీవిత భాగస్వామిగా ఊహించుకోలేదని చెప్పిన కాజల్.. ఒకవేళ పరిశ్రమకు చెందినవారిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే, అతను తన వృత్తిని, మనోభావాలను గౌరవించి, అర్థంచేసుకునే వ్యక్తి అయితేనే ఆలోచిస్తానని వివరించింది. 


ఇక కాజల్ అగర్వాల్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే, శంకర్ దర్శకత్వంలో రానున్న భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ సరసన జంటగా నటిస్తోందామె.