Water Tank: నీటి ట్యాంకులో మానవ మృతదేహం.. 10 రోజులుగా అవే నీళ్లు సరఫరా.. తాగలా చావలా?

Human Body In Water Tank At Nalgonda Municipality: తెలంగాణలో తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మొన్న కోతులు మృతిచెందగా.. తాజాగా నీటి ట్యాంకులో మానవుడి మృతదేహం పడి ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 3, 2024, 04:22 PM IST
Water Tank: నీటి ట్యాంకులో మానవ మృతదేహం.. 10 రోజులుగా అవే నీళ్లు సరఫరా.. తాగలా చావలా?

Human Body In Water Tank: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని తెలుస్తోంది. రెండు నెలల కిందట నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు ఉన్న సంఘటన కలకలం సృష్టించగా.. తాజాగా మరో నీటి ట్యాంకులో మానవ మృతదేహం ఉంది. మృతదేహం పడిన నీటినే దాదాపు పది రోజుల పాటు ప్రజలు తాగిన దారుణ పరిస్థితి. ఈ సంఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి అని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

Also Read: Tragedy: తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తీవ్ర విషాదం.. హెడ్‌ మాస్టర్‌ మృతి

 

నల్లగొండ మున్సిపాలిటీలో పాతబస్తీ హిందూపూర్‌లో నీటి ట్యాంకర్‌ ఉంది. ఆ నీరు 11వ వార్డుతో పాటు మరికొన్ని కాలనీలకు నీళ్లు వెళ్తున్నాయి. తాగునీరు తేడాగా ఉండడంతో  11 వార్డు ప్రజలు వాటర్‌ వర్క్స్‌ విభాగానికి ఫిర్యాదు చేశారు. కాలనీవాసుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సిబ్బంది వెళ్లి ట్యాంక్‌ను పరిశీలించగా అందులో ఓ మృతదేహం పడి ఉంది. దీంతో కాలనీవాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read: Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ను వెంటాడుతున్న మృత్యువు.. మరో గ్యాంగ్‌ అరెస్ట్‌

 

నీటి ట్యాంకులో మృతదేహం కనిపించడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లను అందించే విషయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. గతంలోనూ నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్‌లో  దాదాపు 30 కోతులు కళేబరాలు పడి ఉన్న విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే నీటి ట్యాంకులో మృతిచెందిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా.. నల్లగొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. గత నెల 24వ తేదీ కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాంకులో నుంచి మృతదేహాన్ని పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది వెలికితీశారు. పది రోజులుగా మృతదేహం ఉన్న నీళ్లు తాగామని గుర్తు చేసుకుని కాలనీవాసులు వాంతులు చేసుకుంటున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. కొందరు స్థానికులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రులకు బారులు తీరుతున్నారు. కాగా ఈ సంఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాగునీళ్లు కూడా అందించలేని దౌర్భాగ్యంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉందని గులాబీ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. వెంటనే ట్యాంకును శుద్ధి చేసి సురక్షితమైన నీటిని అందించాలని కోరుతున్నారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News