Kaliyugam Pattanamlo Movie Updates: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సరికొత్త మేకింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా న్యూ ఏజ్ ఫిల్మ్‌ మేకర్స్‌ సినిమాలను రూపొందిస్తున్నారు. కొత్త జానర్‌లో సిల్వర్‌ స్క్రీన్‌పై వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. కాన్సెప్ట్‌ కొత్తగా ఉండి.. చక్కటి మేకింగ్‌తో ఆవిష్కరిస్తే కచ్చితంగా ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. అలాంటి డిఫరెంట్ స్టోరీతో ‘కలియుగం పట్టణంలో’ అనే మూవీ రాబోతోంది. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా యాక్ట్ చేశారు. రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాటం రమేష్, జి మహేశ్వరరెడ్డి, డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డిలు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. సినిమా సూపర్‌గా వచ్చిందని మూవీ మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఫిబ్రవరిలో థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వంటి టాప్ టెక్నీషియన్ వర్క్ చేశారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, భాస్కర భట్ల పాటలకు సాహిత్యాన్ని అందించారు. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. త్వరలోనే ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టనున్నారు. 
 పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు.


==> నటీనటులు :  విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్
==> బ్యానర్ : నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్
==> ప్రొడ్యూసర్స్ : డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌
==> డైరెక్టర్ : రమాకాంత్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్ : అజయ్ అరసాడ
==> కెమెరామెన్ : చరణ్ మాధవనేని
==> పాటలు : చంద్రబోస్, భాస్కర భట్ల
==> ఎడిటర్ : గ్యారీ బీహెచ్
==> PRO : సాయి సతీష్


Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్


Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter