Vikram Movie Making Video Released: చాలా కాలం తర్వాత విక్రమ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు కమల్ హాసన్.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా ఫహాద్ ఫాజిల్,  విజయ్ సేతుపతి వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. అంతేకాక సూర్య రోలెక్స్ ఒక కీలక పాత్రలో నటించి ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్నాడు. జూన్ మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన స్పందన తెచ్చుకోవడమే గాక కమల్ హాసన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని కమల్ హాసన్ స్వయంగా మహేంద్రన్ తో కలిసి నిర్మించారు. చాలా కాలం తర్వాత తన సొంత ప్రొడక్షన్స్ రాజకమల్ పిక్చర్స్ మీద కమల్ హాసన్ ఈ నీ సినిమాను నిర్మించడం ఆసక్తికరంగా మారింది. సినిమాలో కమల్ హాసన్ యాక్టింగ్,  ఫహద్ ఫాసిల్,  విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తమిళనాడులో బాహుబలి కలెక్షన్ల రికార్డు కూడా బద్దలు కొట్టి టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. 


థియేటర్లలో ప్రేక్షకుల ముందు సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా తెలుగు ప్రేక్షకులను అలాగే తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. జూలై పదో తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. దాదాపు 6 నిమిషాల నిడివి ఉన్న మేకింగ్ వీడియోలో సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు ఎలా షూట్ చేశారు? షూట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు చూపించే ప్రయత్నం చేశారు. 


అలాగే కెమెరా యాంగిల్స్,  కొన్ని సీన్స్ ఎలా షూట్ చేశారు అనే విషయం మీద ఒక క్లారిటీ ఇచ్చే విధంగా వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియో షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఏదైతే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారో అదే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఈ వీడియోతో ఆకట్టుకున్నారు. వీడియో ఆద్యంతం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగింది మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఈ సినిమా మేకింగ్ వీడియో మీద మీరు కూడా ఒక లుక్ వేయండి.


Also Read: Mahesh Babu- Trivikram Movie: ఆగస్టులో రంగంలోకి మహేష్ బాబు.. సమ్మర్ టార్గెట్ ఫిక్స్.. క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చిన యూనిట్!


Also Read:  Priya Anand: నిత్యానందతో ప్రియా ఆనంద్ పెళ్లి.. సింక్ కోసం రెడీ అంటున్న భామ!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.