Kareena Kapoor Sleep: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?
Kareena Kapoor Sleep while Watching Laal Singh Chaddha Film. లాల్‌సింగ్ చద్దా ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, కరీనా కపూర్ హాజరయ్యారు. అయితే థియేటర్‌లో ఓ ట్విస్ట్ జరిగింది.
Kareena Kapoor Sleep while Watching Aamir Khan Laal Singh Chaddha movie: బాలీవుడ్ సీనియర్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన కామెడీ సినిమా 'లాల్‌సింగ్ చద్దా'. డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బెబో కరీనా కపూర్ కథానాయికగా నటించారు. టాలీవడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు లాల్‌సింగ్ చద్దా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ అందరిని ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రమోషన్స్‌లో భాగంగా లాల్‌సింగ్ చద్దా సినిమా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ప్రీమియర్ షోకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు, కరీనా కపూర్ హాజరయ్యారు. అయితే లాల్ సింగ్ చద్దా సినిమాను అమీర్, కిరణ్ రావు ఎంతో ఆసక్తిగా చూస్తుంటే.. కరీనా మాత్రం హాయిగా నిద్ర పోయారు. కుర్చీపై చేయి పెట్టి మరీ ఘాడ నిద్రలోకి వెళ్లిపోయారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో కరీనా పేరు నెట్టింట మార్మోగిపోతోంది.
థియేటర్‌లో సినిమా చూస్తూ.. కరీనా కపూర్ నిద్రపోవడం చూసిన నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'లాల్ సింగ్ చద్ధా సినిమా చాలా బోరింగ్‌గా ఉందేమో, అందుకే కరీనా కపూర్ నిద్రపోతున్నారు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కరీనా కపూర్ తన స్వంత స్క్రీన్ టైమ్ కారణంగా నిద్రపోయారు' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. కరీనా కపూర్ నిద్రపోతున్న ఫొటోస్ 'సహర్ష్' అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అవి క్షణాల్లో వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే తన సినిమానే చూస్తూ బెబో నిద్రపోవడం ఇక్కడ విశేషం.
Also Read: Rama Rao On Duty: నేను అతిథిగా రాలేదు.. రవితేజ అన్న గురించి మాట్లాడాలనే వచ్చా: నాని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.