Rama Rao On Duty: నేను అతిథిగా రాలేదు.. రవితేజ అన్న గురించి మాట్లాడాలనే వచ్చా: నాని

Nani about Ravi Teja in Ramarao on Duty Movie Pre Release Event. ర‌వితేజ హీరోగా నటించిన రామారావు ఆన్‌ డ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా వచ్చారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 25, 2022, 12:41 PM IST
  • ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా నాని
  • నేను అతిథిగా రాలేదు
  • రవితేజ అన్న గురించి మాట్లాడాలనే వచ్చా
Rama Rao On Duty: నేను అతిథిగా రాలేదు.. రవితేజ అన్న గురించి మాట్లాడాలనే వచ్చా: నాని

Nani about Ravi Teja in Ramarao on Duty Movie Pre Release Event: శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా నటించిన సినిమా 'రామారావు ఆన్‌ డ్యూటీ'. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. ర‌వితేజ సరసన రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్లుగా నటించారు. జులై 29న 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రం థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా వచ్చారు. 

ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా నాని మాట్లాడుతూ... 'ఈ ప్రీరిలీజ్‌ వేడుకకు నేను అతిథిగా రాలేదు. రవితేజ అన్న గురించి మాట్లాడలనే వచ్చా. చిరంజీవి గారు అంటే రవితేజకు చాలా ఇష్టం. రవన్న సినీ కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు చిరుని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు రవి అన్నను స్ఫూర్తిగా తీసుకున్నాం. మెగాస్టార్ చిరంజీవి క్యారవ్యాన్‌లోకి రవితేజ వెళ్లిన సీన్‌ చూశా. త్వరలో నేనూ కూడా రావన్న క్యారవాన్‌లోకి వెళతానని అనుకుంటున్నా. అది జరుగుతుంది' అని అన్నారు. 

'రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాపై నాకు ముందు నుంచీ పాజిటీవ్‌ వైబ్‌ ఉంది. టీజర్లు, సాంగ్స్, ట్రైలర్లు చూశాక నా నమ్మకం మరింత పెరిగింది. ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ల నుంచి రవితేజ అన్న ఆన్‌ డ్యూటీలోనే ఉన్నాడు. ఈనెల 29 నుంచి థియేటర్స్‌లో రామారావు ఆన్‌ డ్యూటీ'  అని నాని చెప్పారు. ఆపై రవితేజ మాట్లాడుతూ సౌత్‌ ఇండస్ట్రీలో వన్నాఫ్‌ ది ఫైనెస్ట్‌ యాక్టర్స్‌ నాని అని అన్నారు. 

రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా టికెట్ రేట్స్ తెలంగాణ మల్టీప్లెక్స్‌లో రూ. 195 రూపాయలు కాగా.. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.150, 100, 50. ఏపీలోని మల్టీప్లెక్స్‌లో రూ. 177 కాగా.. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 147, 80. ఈ సినిమాలో ర‌వితేజ ఎమ్మార్వో పాత్ర చేస్తున్నారు. సీనియ‌ర్ హీరో వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఆయన సీఐ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో నాజ‌ర్‌, త‌నికెళ్ల‌ భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. 

Also Read: Gold Price Today July 25: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. స్థిరంగా పసిడి ధరలు! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

Also Read: రెచ్చిపోయిన అక్షర్ పటేల్.. ఉత్కంఠ పోరులో భారత్ విజయం! విండీస్‌పై సిరీస్‌ కైవసం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News