హైదరాబాద్: కింగ్ కోబ్రా, ముంగూస్ ల మధ్య పోరాటం రహదారి మధ్యలో అందరినీ ఆశ్యర్యపర్చింది. కాగా పాత వైరల్ వీడియో  ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండడంతో ఇంటర్నెట్ దృష్టిని మళ్లీ ఆకర్షించింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కోబ్రా అనగానే పాము జాతిలో రాజు అని, దీనికి వ్యతిరేకంగా నిలబడలేవు కానీ, ముంగూస్‌లో ప్రత్యేకమైన శక్తులున్నాయని, ఆయన వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

Read Also: మా నాయకుడు చెబితే బావిలోనైనా దూకుతాం: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు


వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ప్రకారం ముంగూస్ లో చాకచక్యం ఎక్కువని, పాములనుడి వేగంగా తప్పించుకుంటాయని, పాము విషం చిమ్మినప్పటికీ మంగూస్ లో ఎటువంటి సమస్యలు రావని, ఎందుకంటే వాటిలో ప్రత్యేకమైన ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు ఉండటం వల్ల వాటి విషానికి విరుగుడుగా పనిచేయడంతో పాటు రోగనిరోధక అధికంగా ఉంటుందని అన్నారు. 


Read Also: నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!


సుశాంత నందా షేర్ చేసిన వీడియోలో, ముంగూస్, కింగ్ కోబ్రా ఒక రహదారిపై ఒకదానిపై ఒకటి దాడిచేసుకోవడం ఓకింత అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంగూస్‌ను దాడిచేయడానికి కింగ్ కోబ్రా పదేపదే ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించడం గమనించవచ్చు. ఒక రోజు క్రితం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి ట్విట్టర్‌లో 18 వేల వీక్షణలను  సంపాదించింది. ఈ వీడియో ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్‌లో కనిపించింది. యూట్యూబ్‌లో అత్యధికంగా 6 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..