Kismat Movie Review & Rating: బిటెక్ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమే 'కిస్మత్'..బిటెక్‌ పూర్తి చేసి కాళీగా ఉండే ఈ కాలం యువత మధ్య జరిగే కథను సినిమా రూపంలో మిలిచితే కిస్మత్‌లా ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది.? మూవీకి సంబంధించిన రివ్యూ, కథ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా వివరాల్లోకి వెళితే..కిస్మత్ సిమాలో విశ్వదేవ్ రాచకొండ, అభినవ్ గోమఠం, రియా సుమన్, అజయ్ ఘోష్‌తో పాటు నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్ చేసారు. ఈ మూవీని బాదినేని శ్రీనాధ్ డైరెక్షన్‌లో కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా మొత్తం కామెడీతో నడుస్తుంది. దీనిని చిత్ర బృదం ఈ రోజు రిలీజ్‌ చేశారు.   


ఇక కథ వివరాల్లోకి వెళితే..
నరేష్ అభినవ్ విశ్వదేవ్ అనే ముగ్గురు యువకులు బీటెక్ చదివి ఒకే ఊరిలో నివసిస్తారు. తల్లిదండ్రులు పెడుతున్న టార్చర్ చూడలేక వీళ్లంతా హైదరాబాదుకి వచ్చి జాబ్ సెర్చింగ్ చేస్తారు. అయితే ఇదే సమయంలో నరేష్ కు రియా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త లవ్‌గా మారుతుంది. ఈ క్రమంలో రాజకీయ నాయకుడైన అజయ్ దగ్గర పనిచేసే వంశీ కూడా పరిచయం అవుతాడు. ఇలా పరిచయం అయిన తర్వాత, పొలిటికల్ క్యాంపెనింగ్‌లో భాగంగా ర్యాలీలకు వెళ్లడం వల్ల డబ్బులు వస్తాయని వంశీ నరేష్ తో చెప్పడం వల్ల రోజు వెళ్తూ ఉంటాడు. ఇలా వెళ్లడం వల్ల కొన్ని డబ్బులు పొందుతాడు. 


అయితే ఇదే సమయంలో అతనికి మరో వ్యక్తి పరిచయమై బ్యాక్ డోర్‌లో ఉద్యోగం వచ్చేలా చేస్తానని చెబుతాడు. దీనికోసం 10 లక్షల వరకు డబ్బు ఖర్చు అవుతుందని చెబుతాడు. దీంతో వారంతా డబ్బు కోసం దొంగతనాల ప్రయత్నంలో ఉంటారు. ఇదే సమయంలో వారికి రెండు కోట్ల వరకు డబ్బు దొరుకుతుంది. ఈ డబ్బులను తీసుకొని అజయ్ ఘోష్ దగ్గరికి వెళ్తారు. అలా మలుపు తిరిగి వారి జీవితం ఎలా వెళ్తుంది అనేది ఈ కథ. అంతేకాకుండా ఆ డబ్బు వల్ల వాళ్ల ముగ్గురికి ఎన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారనేది సినిమా..


సినిమా విశ్లేషణ:
ఫస్ట్ హాల్ఫ్ మొత్తం ఊళ్లో జరగడంతో ఎంతో ఫన్ గాను ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చాక.. వారు పూర్తిగా మారడం మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఇదే డబ్బులు దొరికే సమయానికి ఇంటర్వెల్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే.. దొరికిన డబ్బులు కారణంగా వారికి వచ్చే కష్టాలు డబ్బుల కోసం వెతకడం..ఇలా అన్నీ సన్నివేశాలు టామ్ అండ్ జెర్రీల ఫైట్ లా అనిపిస్తుంది. ఈ సినిమాలో బీటెక్ చదివిన వారు జాబ్ లేకపోవడం వల్ల ఎలా ఖాళీగా ఉంటున్నారో? కుప్పలు తిప్పలుగా పుట్టుకు వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలపై సుదీర్ఘంగా చర్చించాడు. ఈ సినిమాలో అన్ని సీరియస్ కథనాలు కూడా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే మంచి క్లైమాక్స్ తో ఈ సినిమా ముగియడం ఎంతో ఆనందం అనిపించింది.


Read Also: Sohel: బోరున ఏడ్చిన బిగ్ బాస్ సోహెల్.. సినిమా చూడాలంటూ కన్నీళ్లతో రిక్వెస్ట్


సాంకేతిక విశేషాలు:
ఈ సినిమాకు డైలాగ్స్ కథ సినీమాటిక్స్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే డబ్బును వెతికే క్రమంలో అందరూ పడ్డ కన్ఫ్యూషన్ కథనాన్ని కూడా ఎంతో సులభంగా క్లారిటీగా రాసుకున్నారు. ఇక కెమెరా విజువల్స్ విషయానికొస్తే చాలా బాగున్నాయి. ముఖ్యంగా కామెడీ సెట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పాటల విషయానికొస్తే పరవాలేదు అనిపించింది. ఈ సినిమా టోటల్గా బీటెక్ చదివే గుర్రాల గురించి చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.


నటీనటులు:
ఈ సినిమాలోని ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. అందర్నీ ఎంతగానో నవ్వించేందుకు ప్రతి ఒక్కరూ టైమింగ్‌తో కామెడీ పండించారు. ఇక సమీర్ చివర్లో ఇచ్చే ట్విస్ట్ అందరినీ ఆకట్టుకుంది.


రేటింగ్ : 3/5


Read Also: Sohel: బోరున ఏడ్చిన బిగ్ బాస్ సోహెల్.. సినిమా చూడాలంటూ కన్నీళ్లతో రిక్వెస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter