Sakshi Movie Review: సినీ పరిశ్రమలో వారసుల సందడి గురించి ఇపుడు తెలిసిందే! మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, దగ్గుబాటి మరియు సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీలు ఇండస్ట్రీని ఏలుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే! సీనియర్ నటుడు నరేష్ బావ కుమారుడు శ‌రణ్ కుమార్ కూడా మిస్టర్ కింగ్ అనే సినిమాతో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ‌రణ్ కుమార్ హీరోగా ఈ వారం 'సాక్షి' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ సినిమాకి శివ కేశ‌న దర్శకత్వం వహించగా.. ఆర్యూ రెడ్డి -బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి నిర్మించారు. ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇపుడు చూద్దాం.. 


కథ:
హీరో అర్జున్ (శరణ్ కుమార్) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తను పని చేసే ప్రాజెక్ట్ హెడ్ నుండి పర్సనల్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటాడు. ఇదే క్రమంలో రిపోర్ట్రర్ నేత్ర (జాన్వీర్ కౌర్) పరిచయం అవటం.. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా మరో పక్కా సీఎం (ఇంద్రజ) అవినీతిని ఆమె తండ్రికి బట్టబయలు చేసే క్రమంలో హీరో తండ్రి (దేవీ ప్రసాద్) ఒకరోజు రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. తండ్రిని ప్రాణాలతో కాపాడుకోవాలంటే డబ్బు అవసరం.. దాని కోసం గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధం అవుతాడు. ఈ క్రమంలో హీరో అర్జున్ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. గంజాయి స్మగ్లింగ్ ట్రాప్ లో అర్జున్ ను ఎలా ఇరికాడు..? మర్డర్ కేసుల నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడు..? ఈ విషయంలో త్రిపాఠి (నాగబాబు) ఏం చేశాడు.. ? అర్జున్, నేత్ర ఒక్కటయ్యారా..? అనేదే సినిమా కథ. 


ఎవరెలా చేశారంటే..?
హీరో విషయానికి వస్తే.. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో శరన్ కుమార్ నటనలో పరిణతి కనిపించింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ జాన్వీర్ కౌర్ కి నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కింది. నాగబాబు ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఇతర నటులతో పోటీ పడి మరి పాత్రని మెప్పించారు. దేవీ ప్రసాద్, ఇంద్రజ, అజయ్ వంటి ఇతర నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. 


Also Read: Rajugari Kodipulao: ఆగస్ట్ 4 న విడుదలకు సిద్ధం అవుతోన్న 'రాజుగారి కోడిపులావ్'


టెక్నీకల్ టీమ్:


కథ విషయానికి వస్తే.. రొటీన్ కథే.. కానీ డైరెక్టర్ తీసుకున్న కొత్త పాయింట్ సినిమా పై ఆసక్తిని పెంచింది. రాజకీయ నాయకులే తమ స్వార్థ రాజకీయాల కోసం చిల్లర పంచాయితీలు చేస్తూ.. రాష్ట్రాన్ని దోచుకుంటున్న తీరు ఒకవైపు.. ఎలాంటి స్వార్థం లేని ఒక జర్నలిస్ట్ తండ్రి.. ఆ తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సినిమా.. 
సినిమా ప్రారంభంలోనే ఆసక్తి పెంచిన డైరెక్టర్.. నేరుగా కథలోకి తీసుకెళ్తాడు. లవ్ ట్రాక్.. హంజాయ్ స్మగ్లింగ్ తో సినిమా స్పీడ్ పెరుగుతుంది. రెండవ భాగంలో సినిమా ట్విస్ట్ లతో  స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకున్నాడు డైరెక్టర్. సినిమాలో కొన్ని సమాజంలో ఉన్న నిజమైన సమస్యలను తెరపైకి తీసుకురావటం.. స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో డైరెక్టర్ శివ కేశ‌న సఫలం అయ్యాడు. ఇక సంగీతం విషయానికి వస్తే.. భీమ్స్ సినిమాలోని అన్ని పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసాడు. ఎడిటింగ్ విలువలు కూడా బాగున్నాయి. 


ఫైనల్ గా చెప్పాలంటే:
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాలోని కొన్ని అంశాలు మరియు సమస్యలు ప్రజలను ఒకింత ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాతో పండగ చేసుకంటారు అనటంలో ఎలాంటి అతిశేయోక్తి లేదు. 

రేటింగ్: 2.5


Also Read: BRO collection Day 1: పవర్ స్టార్ మేనియా.. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టిన 'బ్రో' మూవీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి