లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
హిందీ చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ (Saroj Khan Dies) ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు.
choreographer Saroj Khan Dies | బాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. లెజెండరీ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కన్నుమూశారు. శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ (Saroj Khan) అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ ప్రముఖులు సరోజ్ ఖాన్ మృతి (Saroj Khan Death)పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి
అనారోగ్యంతో జూన్ 20న ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్య కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్19 నెగటివ్‌గా నిర్ధారించారు. వయసురీత్యా సమస్యలు కూడా ఉండటంతో ఆమె కోలుకోలేకపోయారు. అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో సరోజ్ ఖాన్ తుదిశ్వాస (Saroj Khan Died) విడిచారు. సరోజ్ ఖాన్ భౌతికకాయాన్ని మలాద్ మిత్ చౌకీకి తరలించారు.1975లో మౌసమ్ సినిమాతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయ్యారు. దాదాపు 40 ఏళ్లపాటు ఇండస్ట్రీకి సేవలందించారు. Nepotism: సినీ ఫ్యామిలీ నుంచి నటుడు తెరంగేట్రం
బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా 3 జాతీయ అవార్డులు అందుకున్నారు. డోలా రె డోలా (దేవ్‌దాస్), ఏ ఇష్క్ హాయే (జబ్ వి మెట్), మణికర్ణిక, తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి సినిమాలు ఆమెకు గుర్తింపు తీసుకొచ్చాయి. సరోజ్ ఖాన్ చివరిసారిగా 2019లో ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ నిర్మించిన కళంక్ మూవీలో మాధురీ నర్తించిన తబా హోగయీ పాటకి కొరియోగ్రఫి చేశారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!