LPG Price Hike: సామాన్యులపై మరోసారి గ్యాస్ బండ పిడుగు పడింది. 15 రోజుల వ్యవధిలో మరోసారి సిలిండర్ ధరలు పెరిగాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరల మోతతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఎల్పీజీ మరోసారి గుదిబండగా మారింది. ఇక నుంచి సబ్సిడీ సిలిండర్లు మరింత ప్రియం కానున్నాయి. డిసెంబర్ 2వ తేదీన రూ.50 మేర ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచిన చమురు సంస్థలు మరోసారి ధరలు పెంపు నిర్ణయం తీసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మంగళవారం నాడు రూ.50 మేర ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ సిలిండర్లపై పెంచారు. తాజాగా ధరల పెంపు నిర్ణయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా పెరిగిన ధరలతో దేశ రాజధాని డిల్లీలో 14.2 కేజీల సబ్సిడీ సిలిండర్ ధర రూ.644 నుంచి రూ.694కి చేరింది 5 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.18 పెరగగా, 19 కేజీల సిలిండర్‌పై రూ.36.50 మేర పెంచారు.  హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర (LPG Gas Price in Hyderabad) రూ.696.50కి పెరిగింది.


Also Read: LPG Price Hiked: సామాన్యుల నెత్తిన గ్యాస్ ‘బండ’


 


కాగా, పెరిగిన సిలిండర్ ధరలు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. వినియోగదారులకు గృహ అవసరాల కోసం సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఆ 12 వంటగ్యాస్ సిలిండర్లపై రాయితీని పొందవచ్చు. ఆ కోటా పూర్తయ్యాక మార్కెట్ ధరలకే ఎల్పీసీ సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


Also Read: LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook