Actor Vishals Chakra Movie: విశాల్‌కు మద్రాస్ హైకోర్టు రూ.8 కోట్ల షాక్!
Madras High Court issues notices to hero Vishal | ఆయన తాజా చిత్రం ‘చక్ర’తో ప్రేక్షకుల మందుకు రావాలని విశాల్ (Actor Vishal) ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం కోలీవుడ్‌లో సంచలనమైంది.
హీరో విశాల్ (Actor Vishal) మరో సినిమా వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన తాజా చిత్రం ‘చక్ర’తో ప్రేక్షకుల మందుకు రావాలని విశాల్ ప్లాన్ చేసుకున్నాడు. దీపావళి కానుకగా చక్ర సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తీసిన చక్ర సినిమాపై కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం కోలీవుడ్‌లో సంచలనమైంది. చక్ర సినిమా (Chakra Movie)లో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ కాగా, రెజీనా విలన్ రోల్ పోషిస్తోంది.
పాత సినిమా వివాదమే ఇందుకు కారణం. విశాల్ గతంలో నటించిన యాక్షన్ సినిమాను ట్రిడెంట్ ఆర్ట్స్ నిర్మించింది. రూ.44కోట్లతో నిర్మించిన సినిమా కారణంగా తాము దాదాపు రూ.20 కోట్ల మేర నష్టపోయామని, విశాల్‌ను అడగగా నెక్ట్స్ మూవీ ఇదే బ్యానర్‌లో చేస్తానని హామీ ఇచ్చినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు.
కాగా, విశాల్ తన సొంత బ్యానర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో చక్ర సినిమా నటించి, నిర్మించాడు. అయితే యాక్షన్ సినిమా తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.12 కోట్లు కూడా వసూలు చేయలేదని, డిజిట్ రూపంలో రూ.10 కోట్లు రాగా, భారీ నష్టాన్ని ఎదుర్కొన్నామని కోర్టుకు తెలిపారు. తర్వాత సినిమా మీకే చేస్తానని మాటిచ్చిన విశాల్, సొంత బ్యానర్‌లో సినిమా చేసి మోసం చేశాడని కోర్టును ఆశ్రయించారు. రూ.8.29 కోట్లు చెల్లిస్తేగానీ చక్ర సినిమా విడుదలకు అనుమతి ఇవ్వరాదని కోర్టును కోరగా, సినిమా విడుదలపై స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై విశాల్ స్పందించాల్సి ఉంది.
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe