డైరెక్టర్ నాగ్ అశ్విన్ అలనాటి నటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై ‘మహానటి'గా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ చిత్రంలో సావిత్రి కాలంనాటి నటులు, నటీమణులు, టెక్నిషీయన్స్, దర్శకులు, నిర్మాతలను కూడా అదే తరహాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే సావిత్రి సినిమా కెరియర్‌కి ఎంతో ముఖ్యమైన దర్శకులుగా పేరున్న కె.వి. రెడ్డి, ఎల్వీ ప్రసాద్ పాత్రలను కూడా తెరపై పరిచయం చేయనున్నారు. ఈ పాత్రలకు గానూ దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్‌లను తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కె.వి.రెడ్డి పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నటిస్తుండగా, ఎల్.వి.ప్రసాద్ పాత్రలో శ్రీనివాస్ అవసరాల నటిస్తున్నారు. ఈ పాత్రలకు సంబంధించిన వీడియోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎల్వీ ప్రసాద్‌గా రీల్ పట్టుకుని చూస్తున్న పాత్రలో అవసరాల శ్రీనివాస్, చూపుడువేలు చూపిస్తూ మాట్లాడుతున్న క్రిష్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా 2017 మేలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. 2018 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంతా అక్కినేని, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు.


మహానటి చిత్రం- పాత్రలు


  • కీర్తి సురేష్- సావిత్రి

  • దుల్కర్ సల్మాన్-జెమినీ గణేషన్

  • సమంత-మధురవాణి

  • విజయ్ దేవరకొండ- విజయ్ అంటోనీ

  • మోహన్ బాబు- ఎస్వీ రంగారావు

  • ప్రకాశ్ రాజ్- ఆలూరి చక్రపాణి

  • క్రిష్- కేవీ రెడ్డి

  • తరుణ్ భాస్కర్ దాస్యం-సింగీతం శ్రీనివాసరావు

  • శ్రీనివాస్ అవసరాల-ఎల్వీ ప్రసాద్