ఆగస్టు 9న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 43వ బర్త్ డే సందర్భంగా నేడు అతడి కొత్త సినిమా మహర్షి ఫస్ట్ లుక్ రిలీజైంది. రిషిగా తన కొత్త జర్నీ ప్రారంభమైందని పేర్కొంటూ మహేష్ బాబు ట్విటర్ ద్వారా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. రిలీజైన కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్, వేలాది రిట్వీట్స్ చేయడం చూస్తే, ఫ్యాన్స్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎంత ఆత్రుతగా వేచిచూస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. అభిమానులు ఆశించినట్టుగానే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గడ్డం లుక్‌లో మహేష్ బాబు బాగా స్టైలిష్‌గా కనిపించాడు. చివరిసారిగా భరత్ అనే నేను సినిమాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపించిన మహేష్ బాబు ఈ సినిమాలో ఫార్చూన్ 500 కంపెనీకి సీఈఓ పాత్ర పోషిస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఊపిరి సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని వంశీ పైడిపల్లి మళ్లీ ఈ సినిమా చేస్తున్నాడు. మహర్షి సినిమాలో అధిక భాగం డెహ్రాడూన్‌లో చిత్రీకరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది.