Ayyagaru Movie: కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా `అయ్యగారు`.. అజయ్ భూపతి చేతులమీదుగా టీజర్ గ్లింప్స్
Ayyagaru Movie Teaser Glimpse: అయ్యగారు మూవీ టీజర్ గ్లింప్స్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి రిలీజ్ చేశారు. మంచి కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైనర్లా ఉందని.. తప్పకుండా విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
Ayyagaru Movie Teaser Glimpse: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కొత్త దర్శకుడు అర్మాన్ మెరుగు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ అయ్యగారు (పెళ్ళికి రెడీ). మంచి ఎనర్జిటిక్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీని ఎ.వెంకట రమణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌ను ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి కామెడీ, యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్‌లా ఉందని ఆయన చెప్పారు. అనంతరం డైరెక్టర్ అర్మాన్ మెరుగు మాట్లాడుతూ.. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటిస్తున్నట్లు తెలిపాడు. నేటి యువతకు అద్దం పట్టేలా ఒక సెన్సిటివ్ పాయింట్‌ను తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేసి తెరకెక్కించినట్లు చెప్పాడు.
అందరినీ నవ్విస్తునే.. మనిషి విలువలు చెప్పడమే తమ సినిమా ముఖ్య ఉద్దేశమన్నాడు. ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నామని చెప్పాడు. దర్శకత్వం, నటనతో పాటు సంగీతం కూడా తానే అందిస్తున్నట్లు అర్మాన్ మెరుగు తెలిపాడు. ప్రొడ్యూసర్ వెంకట రమణ మాట్లాడుతూ.. డైరెక్టర్ అర్మాన్ చెప్పిన స్టోరీ బాగా నచ్చింది. ఈ కథను ఎలాగైనా ప్రేక్షకుల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మించానని చెప్పారు. తప్పకుండా ఆడియన్స్ తమ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు.
సిద్ధి ఖన్నా, వెంకట రమణ, సునీల్ రావినూతల, ప్రకాష్, రాజేష్, మహేష్, గోపి చందు, మేఘన అనిమిరెడ్డి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సీఎస్ చంద్ర వ్యవహరిస్తుండగా.. ఎడిటర్‌గా కేసీబీ హరి పనిచేస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శత్వం, సంగీతం, డైలాగ్స్ కమ్ హీరోగా అర్మాన్ మెరుగు నటిస్తున్నాడు.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook