Manthoni Kadu Ra Bhai Lyrical Song: యదార్థ ఘటనల ఆధారంగా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం రాబోతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం సిద్దంగా ఉంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ISM విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా రామ్‌  (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మిస్తుండగా.. సూర్య అయ్యలసోమయజుల హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రాహుల్ సిప్లిగంజ్ పాడిన దేశ భక్తి గీతం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ఇక ఇప్పుడు కాస్త రొమాంటిక్ టచ్ ఉన్న పాటను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ పాటను రిలీజ్ చేస్తూ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. 'మనతోని కాదురా భై' అంటూ సాగే ఈ పాటకు.. రాము కుమార్ ఏఎస్‌కే సాహిత్యం, ధనుంజయ్ గాత్రం, ఆశ్రిత్ అయ్యంగార్ బాణీ ఇలా అన్నీ కలిసి వినసొంపుగా మార్చాయి.


కమర్షియల్, యాక్షన్, పేట్రియాటిక్ జానర్లో రాబోతోన్న ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ మ్యూజిక్ అందించారు. ధారణ్ సుక్రి DAC సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. 


సాంకేతిక సిబ్బంది:
==> కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మిహిరామ్ వైనతేయ
==> నిర్మాత: దీపికాంజలి వడ్లమాని
==> బ్యానర్స్: దీపికా ఎంటర్‌టైన్‌మెంట్ & ఓ ఎస్‌ యం విజన్‌ 
==> సంగీతం: ఆశ్రిత్ అయ్యంగార్
==> సినిమాటోగ్రఫీ దర్శకుడు: ధారన్ సుక్రి DAC
==> PRO:  సాయి సతీష్


Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


 Also Read: OnePlus 12R Price: Oneplus లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..చౌకగా మార్కెట్‌లోకి OnePlus 12R మొబైల్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter