ఈ రోజు (మార్చి 2) నుంచి  తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో చిత్ర ప్రదర్శన నిలిచిపోనుంది. డిజిటల్ ప్రొవైడర్స్ ఛార్జీలకు వ్యతిరేకంగా బంద్‌ పిలుపు నేపథ్యంలో థియేటర్లు మూతబడనున్నాయి. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలతో సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో సినిమాల ప్రదర్శన నిలిపివేయనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 వేల 500 థియేటర్లు ఉన్నాయి. బంద్ ప్రభావంతో  థియేటర్లు మూతపడే అవకాశాలు ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డిజిటల్ ప్రొవైడర్లు క్యూబ్, యూఎఫ్ ఓ సంస్థలకు, నిర్మాత సంఘాలకు ఇటీవల జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో మార్చి 2 నుంచి సినిమాలను ఆయా సర్వీస్ లకు ఇవ్వకూడదని నిర్మాతల ఐకాస నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకులు కూడా తమకు సహకరించాలని ఈ సందర్భంగా నిర్మాతల సంఘం కోరింది.


నిర్మాత సంఘాల డిమండ్లు ఇవే : 


* వీపీఎఫ్ ఛార్జీలు మినహాయింపు
* అదనంగా రెండు సినిమా యాడ్స్ ఇవ్వాలి
*  కమర్షియల్ యాడ్స్ నిడివి 8 నిమిషాల కంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన సడలించాలి
ఈ మూడు డిమాండ్లు అంగీకరించపోవడంతో నిర్మాతల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుంది.