తెలుగు సినీ పరిశ్రమలో మ్యూజిక్ కు కేరాఫ్ అడ్రస్‌గా  నిలిచిన తక్కువ మంది సంగీత  దర్శకుల్లో ఒకరు దేవీ శ్రీ ప్రసాద్. డీఎస్పీగా సంగీత ప్రియులకు సుపరిచితమైన దేవీ శ్రీ ప్రసాద్..  ఉగాది సందర్భంగా తనదైన శైలిలో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు, సంగీత ప్రియులకు శుభాకాంక్షలు  తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యూజిక్ స్టూడియోలో ఒక్కడే పని చేసుకుంటున్న ఆయన ఉగాది సందర్భంగా మ్యూజికల్ విషేస్  చెప్పారు. తెలుగు  ప్రజలంతా కొత్త ఏడాదిని ఉత్సాహంగా  జరుపుకోవాలని ఆకాంక్షించారు. అంతే కాదు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో .. అందరూ హోమ్ క్వారంటైన్  పాటించాలని కోరారు. ఒకవేళ  తప్పనిసరి  పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సోషల్ డిస్టన్స్ పాటించాలని సూచించారు. మరోవైపు చేతులు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరిగా పాటించాలన్నారు. తన మ్యూజిక్ స్టూడియోలో తాను అదే చేస్తున్నానని తెలిపారు.  ముఖానికి  తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు.


'కరోనా'ను ఎదుర్కునేందుకు రూ. 2 కోట్ల సాయం




అలాగే కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు 24  గంటలు  పని చేస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు అందరూ కృతజ్ఞతగా  ఉండాలన్నారు. డీఎస్పీ  చేసిన ట్వీట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..