పెళ్లయిన తర్వాత సమంతలో మార్పు
నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత సమంతలో ఒకే ఒక్క మార్పు వచ్చిందని మామ, హీరో నాగార్జున పేర్కొన్నారు. పెళ్లికి ముందు ‘నాగ్ సార్’ అనేదని...పెళ్లయిన తర్వాత ‘మామ’ అంటోందని ఓ ఇంటర్వ్యూలో నాగార్జున సరదాగా వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ- నాగార్జున కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ..కోడలు సమంత గురించి ముచ్చటించారు.
నాగ్ వ్యాఖ్యలు యథాతథంగా ...
'నాగచైతన్యతో వివాహం అయిన తర్వాత సమంతలో పెద్దగా మార్పులేమీ రాలేదు. పెళ్లికి ముందు నుంచి ఆమె మా కుటుంబంలో సభ్యురాలే'నని పేర్కొన్నారు. సమంతకు పెళ్లి కాకముందు తనను ‘నాగ్ సార్’ అనేదని.. పెళ్లయిన తర్వాత ‘మామ’ అంటోందని చెప్పి నాగార్జున నవ్వులు చిందించారు.