అధికార లాంఛనాల మధ్య పూర్తయిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు.. చితికి నిప్పంటించిన కళ్యాణ్ రామ్
జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పూర్తయిన నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు
ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఉన్న స్మశానవాటికలో అధికార లాంఛనాల మధ్య నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ మహాప్రస్థానం జోహార్లు నందమూరి హరికృష్ణ గారికి జోహార్లు, నందమూరి హరికృష్ణ అమర్ రహే అనే నినాదాలతో మార్మోగిపోయింది. యావత్ తెలుగు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలకు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేత మంది ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.