Lawrence Rudrudu Poor Opening ప్రతీ వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు హిట్ అవుతుంటాయి. కొన్ని ఫట్ అవుతుంటాయి. అయితే హిట్ అయిన సినిమాలకు మూడు నాలుగు వారాల టైం ఉంటే.. డిజాస్టర్ సినిమాలకు ఒక్క రోజు కూడా టైం ఉండదు. సమంత శాకుంతలం, లారెన్స్ రుద్రుడు సినిమా ఇప్పుడు డిజాస్టర్ టాక్‌తో కలెక్షన్ల గండి పడ్డట్టు అవుతోంది. ఈ రెండు సినిమాలకు దారుణమైన టాక్ వచ్చింది. దీంతో సినిమాకు కలెక్షన్లు కూడా నిల్ అయినట్టు అనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శాకుంతలం సినిమా క్లాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేయగా.. రుద్రుడు సినిమా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఏ ఒక్క విషయంలోనూ ఈ రెండు సినిమాలు మెప్పించలేకపోయాయి. దీంతో ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి లేకుండాపోయింతి. సమంత, లారెన్స్ ఇద్దరూ కూడా ఈ వారం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డట్టు అయింది.


శాకుంతలం, రుద్రుడు సినిమాలు నెగెటివ్ టాక్, రివ్యూలతో వెనక పడటంతో.. దసరా సినిమా మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే దసరా సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరింది. అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమా రెండు మిలియన్ల క్లబ్బులో చేరింది. దీంతో నాని టాప్ హీరో లీగ్‌లో చేరిపోయాడు. టైర్ 2 హీరోల్లో నాని, విజయ్‌లు మాత్రమే రెండు మిలియన్ల క్లబ్బులోకి చేరారు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


ఈ వారం సమంత, లారెన్స్ డీలా పడటంతో నాని మళ్లీ ఊపందుకునేలా కనిపిస్తున్నాడు. అయితే వీకెండ్‌ వరకు అయినా శాకుంతలం, రుద్రుడు సినిమాలు ఆడతాయా? హౌస్ ఫుల్ అవుతాయా? కనీసం కలెక్షన్లు వస్తాయా? అన్నది తెలియడం లేదు. శాకుంతలం, రుద్రుడు సినిమాల పరిస్థితి మరీ దారుణంగా మారేలా కనిపిస్తోంది. నెక్ట్స్ వీక్ అయితే అఖిల్, సల్మాన్ ఖాన్ వంటి వారు బరిలోకి దిగబోతోన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook