నయనతార ‘లేడీ టైగర్’ రిలీజ్‌కి రెడీ
ఇటీవలే ‘కర్తవ్యం’ సినిమాతో ఆకట్టుకున్న నయనతార ఇప్పుడు మరో సైకలాజికల్ థ్రిల్లర్‌తో కనువిందు చేయడానికి రెడీ అవుతోంది. గతంలో శ్యామ్ ప్రసాద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మళయాళ సూపర్ హిట్ మూవీ ‘ఎలెక్ట్రా’ని ఇప్పుడు తెలుగులో ‘లేడీ టైగర్’గా రిలీజ్ చేసే ప్రాసెస్‌లో ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.
కంప్లీట్ సైకలాజికల్ థ్రిల్లర్‌లా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్‌లో ఉంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్స్‌లో నటించడం విశేషం. ఆల్ఫోన్స్ జోసెఫ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో నయనతార డిఫెరెంట్ రోల్‌లో మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.