Radhaamadhavam Movie: `రాధా మాధవం` నుంచి అదిరిపోయే మాస్ బీట్.. `నేల మీద నేను ఉన్నా..` సాంగ్ రిలీజ్
Nelamidha Nenu Unna Lyrical Video: రాధా మాధవరం మూవీ నుంచి అదిరిపోయే మాస్ బీట్‌ను బిగ్‌బాస్ సోహెల్ చేతుల మీదుగా విడుదల చేశారు. `నేల మీద నేను ఉన్నా` అంటూ సాగే ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. డిసెంబర్లోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Nelamidha Nenu Unna Lyrical Video: విలేజ్ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాధామాధవరం'. విలేజ్ లవ్ స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఈ జానర్‌లో ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. తాజాగా అలాంటి గ్రామీణ నేపథ్యంలోనే జరిగే ప్రేమకథను మేకర్స్ పరిచయం చేయనున్నారు. గోనాల్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వసంత్ వెంకట్ బాలా , మాటలు, పాటలను అందించారు.
ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వగా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలకు షురూ చేశారు. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేయగా.. మూవీ పోస్టర్‌ను డీపీఎస్ ఇన్‌ఫో టెక్ మేనేజింగ్ డైరెక్టర్ డా.డీఎస్ఎన్ రాజు రిలీజ్ చేశారు.తాజాగా రాధా మాధవరం మూవీ నుంచి ఓ అదిరిపోయే ఫాస్ట్ మాస్ బీట్‌ను బిగ్‌బాస్ సోహెల్ బుధవారం విడుదల చేశారు. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని మేకర్స్‌కు అభినందనలు తెలిపాడు.
'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే మాస్ బీట్‌లో అదిరిపోయే స్టెప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌ను వసంత్ వెంకట్ బాలా రాయగా.. వీఎం మహాలింగం, ఎంఎం మానసి గాత్రం అందించారు. కొల్లి చైతన్య ఇచ్చిన బాణీలు చక్కగా కుదిరాయి. డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. కెమెరామెన్‌గా తాజ్ జీడీకే వ్యవహరించారు. ఎడిటర్‌గా కే.రమేష్ వర్క్ చేశారు. ఫైట్స్ మాస్టర్‌గా రాబిన్ సుబ్బు పనిచేశారు.
Also Read: Vijay Devarakonda: విజయ దేవరకొండ పై అసభ్యకర వార్తలు... ప్రచారపు వ్యక్తి అరెస్ట్
Also Read: Honey with Garlic: రోజూ పరగడుపున ఈ మిశ్రమం తీసుకుంటే మెరుపువేగంతో అధిక బరువు మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి