Nenu - Keerthana: ఆసక్తిరేకిస్తోన్న చిమటా ప్రొడక్షన్స్ `నేను - కీర్తన`ఫస్ట్ లుక్, టీజర్..
Nenu - Keerthana: ఈ మధ్య కాలంలో చిన్న చిత్రంగా విడుదలైన చిత్రాలు పెద్ద హిట్‌గా నిలుస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం `నేను - కీర్తన`. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Nenu - Keerthana: చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరో, హీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన చిత్రం "నేను-కీర్తన". తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఈ టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, "రజాకర్" దర్శకుడు యాటా సత్యనారాయణ చీఫ్ గెస్ట్స్‌గా హాజరయ్యారు. టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో నూతన నిర్మాణ సంస్థ తీసిన సినిమా చేసినట్టు అనిపించడం లేదన్నారు. హీరోగా చిమటా రమేష్ బాబు(సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందన్నారు. 'నేను-కీర్తన' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ చిత్ర యూనిట్‌ను అభినందించారు.
చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు సిల్వర్ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్ కావడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కనిపిస్తోందన్నారు. 'నేను-కీర్తన' చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, డైరెక్టర్‌గా తెరకెక్కించానన్నారు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా మలచిన "నేను-కీర్తన" చిత్రం కచ్చితంగా నిలుస్తుందన్నారు. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఆశాభావం వ్యక్తం చేశారు.
"నేను-కీర్తన" చిత్రంలో నటించడం చాలా సంతృప్తి ఇచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ రిషిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, రాజ్ కుమార్, ఎర్రచీర సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వి.ఎఫ్.ఎక్స్: నవీన్, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.).
Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook