Karthikeya 2 1st day Collections: నిఖిల్ సిద్ధార్థ హీరోగా 2014వ సంవత్సరంలో విడుదలైన కార్తికేయ మూవీ సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన కార్తికేయ 2 సినిమా ఆగస్టు 13వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో మినహా మిగతా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో థియేటర్లలో విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమాకి థియేటర్లు తక్కువగా లభించడంతో కొంతమేర తక్కువ స్క్రీన్స్ లో విడుదలైంది. కానీ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిఖిల్ సిద్ధార్థ కెరియర్ లోనే ఓపెనింగ్ భారీగా లభించిన సినిమాల్లో మొదటి స్థానంలో ఈ సినిమా నిలుస్తోంది. కార్తికేయ 2 సినిమా ఏరియాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందనే విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో కోటి రూపాయల 24 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 45 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 45 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 33 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 44 లక్షలు, కృష్ణా జిల్లాలో 27 లక్షలు, నెల్లూరు జిల్లాలో 17 లక్షలు మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణలో కలిపి మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది.


అదే విధంగా కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం పాతిక లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా కోటి రూపాయల 30 లక్షలు సాధించింది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 12 కోట్ల 80 లక్షల రూపాయలకు జరుపుకోగా ఇప్పటికే ఐదు కోట్ల ఐదు లక్షలు వసూలు చేసింది కాబట్టి ఇంకా ఎనిమిది కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించి తద్వారా సూపర్ హిట్ స్టేటస్ సాధిస్తుంది. ఇక ఈ సినిమాకి లభించిన క్రేజ్ దృష్ట్యా అది పెద్ద విషయంలా కనిపించడం లేదు.


ఇక ఈ సినిమాకు ఆదివారం నుంచి స్క్రీన్స్ పెంచడంతో పాటు ఆదివారం తర్వాత సోమవారం కూడా సెలవు రోజు కావడంతో థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో పాటు ధియేటర్లు కూడా పెంచుతున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి నిఖిల్ సిద్ధార్థ కెరీర్ లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక నిఖిల్ సిద్ధార్థ చివరి ఐదు సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ లను చూస్తే వాటన్నింటిలో కిరాక్ పార్టీ అనే సినిమాకి కోటి రూపాయలు 65 లక్షల లభించాయి. అయితే  సుమారు దానికి రెండింతలు ఈ సినిమాకు లభించడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Macherla Niyojakavargam: కార్తికేయ 2 దెబ్బకు భారీగా పడిపోయిన మాచర్ల వసూళ్లు… ఎన్ని కోట్లు డ్రాప్ అంటే?


Also Read: Mahesh Babu: కొత్త లుక్ లో మెరిసిపోతున్న మహేష్ బాబు.. ఫోటో చూశారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి