కొద్ది రోజులుగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న హీరో నితిన్ కు .. 'బీష్మ' చిత్రం ఆ కోరిక తీర్చేలా కనిపిస్తోంది. ' శ్రీనివాస కళ్యాణం' చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో .. నితిన్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. తాజాగా హీరో నితిన్ నటించిన  చిత్రం 'బీష్మ'. ఇందులో  రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ చిత్రం ట్రెయిలర్‌ను నిన్న విడుదల చేశారు. ట్రెయిలర్ విడుదలై 24 గంటలు గడవక ముందే మాంచి దూకుడుతో దూసుకెళ్తోంది.  ఇప్పటికే ఈ ట్రెయిలర్‌ను దాదాపు 25 లక్షల మంది చూసేశారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈసారి నితిన్ ఖాతాలో హిట్ ఖాయమని ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినిమా యూనిట్ కూడా సంతోషంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: ఆ హీరోయిన్ వచ్చిన వేళా విశేషం.. నితిన్‌కు పెళ్లి!


భీష్మ పేరు పెట్టడం వల్లే ఒక్క అమ్మాయి కూడా పడడం లేదు.. అని అల్లరిగా తిరిగే ఓ యువకుడు .. ఎరువుల కంపెనీ ఆగడాలకు ఎలా చెక్ పెట్టాడనే ఇతివృత్తంతో సినిమా తీసినట్లు ట్రెయిలర్ చూస్తే.. తెలుస్తోంది. సినిమా స్టోరీ పూర్తిగా తెలియకుండా ట్రెయిలర్‌ను తీర్చిదిద్దారు. హీరో నితిన్ చెప్పే కొటేషన్లు ఆకట్టుంకుంటాయి. రఘుబాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తోంది.



 


'భీష్మ' సినిమాకు ఛలో చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టెయిన్‌మెంట్‌పై రూపుదిద్దుకున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. పీడీవి ప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను మరో మూడు రోజుల్లోనే అంటే ఫిబ్రవరి  21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హీరో నితిన్, రష్మిక మందన్న జంట .. ఈ సినిమాలో బాగా కనిపిస్తున్నారు.


[[{"fid":"182131","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..