యంగ్ టైగర్‌కు అమ్మాయి పుట్టింది!
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు అమ్మాయి పుట్టినట్లు తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు అమ్మాయి పుట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 10:20 నిమిషాలకు ప్రణతి పండింటి బిడ్డకు జన్మనివ్వగా.. సోషల్ మీడియాలో దంపతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ జంటకు అభయ్ అనే కుమారుడు ఉండగా.. తాజాగా వారసులు రావడంతో.. 'తారక్ భయ్యా' కంగ్రాట్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కుటుంబ సభ్యుల నుంచి గానీ, తారక్ నుంచి గానీ ఇప్పటివరకైతే ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. యాక్షన్‌కి ప్రాధాన్యం ఉంది. పూజా హెగ్డే కథానాయిక. రాధామోహన్ నిర్మాత. సంగీతం: తమన్. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. అందుకే ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు.
ఎన్టీఆర్ దర్శకుడు రాజామౌళీతో కూడా ఓ సినిమా చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో సినిమా పట్టాలపైకి ఎక్కే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 2019లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.