ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలు
నందమూరి తారకరామారావు జీవితంపై తెరకెక్కుతున్న ఎన్టీఆర్ షూటింగ్ నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది.
నందమూరి తారక రామారావు జీవితంపై తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' షూటింగ్ నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభోత్సవ కార్యాక్రమంలో నందమూరి కుటుంబీకులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దాన వీర శూరకర్ణ షూటింగ్ సెట్‌లో దుర్యోధనుడి పాత్రలో బాలకృష్ణ అందర్నీ ఆకట్టుకున్నారు. నేడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కూడా..!
తెలుగుదనానికి, దర్పానికి ప్రతిరూపం ఎన్టీఆర్ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. 'ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభ వేడుకలో పాల్గొన్న ఆయన బాలకృష్ణపై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రపంచంలో తెలుగువారికి ఓ గుర్తింపు తెచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా రావడం శుభదాయకమని, ఎన్టీఆర్ మీద నాకున్న అభిమానం, స్నేహం, ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్లనే ఈ కార్యక్రమానికి హాజరయినట్లు చెప్పారు. ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రాలు మార్చి 29నే విడుదలయ్యయని గుర్తుచేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు.