యన్‌టిఆర్ బయోపిక్.. బసవతారంకం లుక్ వచ్చేసింది..!
ఎన్టీఆర్ బయోపిక్: బసవతారంకం లుక్ వచ్చేసింది..!
నందమూరి తారక రామారావు జీవితాధారంగా టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. క్రిష్ డైరక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌గా బాలక్రిష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం లుక్ బయటికి వచ్చింది.
ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటిస్తున్న విద్యాబాలన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో బసవతారకం లుక్‌లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. ఫొటోపై 'నేనేం చూస్తున్నాను' అనే కామెంట్ పెట్టింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘యన్‌టిఆర్’ బయోపిక్‌లో హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్, చంద్రబాబు నాయుడుగా రానా దగ్గుబాటి , అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
కాగా ‘యన్‌టిఆర్’ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24 ‘మహానాయకుడు’గా విడుదల చేయనుంది మూవీ యూనిట్.
[[{"fid":"175158","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]