ఆస్కార్ అవార్డ్స్ 2018 వేదికపై శ్రీదేవి, శశి కపూర్‌లకి హాలీవుడ్ ఘన నివాళి
ఫిబ్రవరి 24న దుబాయ్‌లో తుది శ్వాస విడిచిన బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి, గతేడాది డిసెంబర్‌లో కన్నుమూసిన బాలీవుడ్ లెజెండ్ శశికపూర్‌లకి హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పించింది.
ఫిబ్రవరి 24న దుబాయ్‌లో తుది శ్వాస విడిచిన బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవికి, గతేడాది డిసెంబర్‌లో కన్నుమూసిన బాలీవుడ్ లెజెండ్ శశికపూర్‌లకి హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పించింది. ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో విశిష్ట ప్రతిభాపాటవాలు కనబరచి, తనువు చాలించిన గొప్పగొప్ప నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులను స్మరించుకుంటూ ప్రతీ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేదికపై 'ఇన్ మెమొరియం' పేరుతో ఓ మాంటేజ్ ప్రదర్శించే సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది కూడా లాస్ ఏంజెల్స్ లో వున్న డాల్బి థియేటర్ వేదికగా వేడుకగా జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇన్ మెమొరియం మాంటేజ్ లో భాగంగా శ్రీదేవి, శశి కపూర్‌లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది.
బాలీవుడ్ లెజెండ్‌గా పేరొందిన శశికపూర్ బాలీవుడ్‌లోనే కాకుండా షేక్‌స్పీయర్ వాలా, ది హౌజ్ హోల్డర్, ది గురు, ఇన్ కస్టడీ, బాంబే టాకీ లాంటి చిత్రాలతో హాలీవుడ్ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితుడయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జేమ్స్ బాండ్ సిరీస్ స్టార్ రోజర్ మూరే, మేరీ గోల్డ్‌బెర్గ్, జోహాన్ జోహాన్సన్, జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్ లాంటి సినీ ప్రముఖులకు హాలీవుడ్ ఈ సందర్భంగా నివాళులు అర్పించింది.