`పద్మావతి`పై కర్ణిసేన వెనక్కితగ్గినట్లేనా ?
సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రం విడుదల కానప్పటికీ, రాజ్ పుత్ కర్ణి సేన ఆ సినిమాను ముందుగానే నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా పై కర్ణిసేన వెనక్కు తగ్గినట్టు అనిపిస్తోంది. సమాచారం బహిర్గతం కానప్పటికీ.. కొన్ని నివేదికల ప్రకారం.. మేవార్ రాజ కుటుంబీకులు సినిమాలో ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు లేవని చెప్పిందట. దాంతో కర్ణి సేన నిరసన ను విరమించాలనుకొంటోంది. గొడవ సద్దుమనగడానికి చలన చిత్ర నిర్మాతలు మరియు నిరసనకారుల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ముందుకొచ్చారట మేవాత్ రాజ కుటుంబీకుడు అరవింద్ సింగ్.