హైదరాబాద్: పొరుగుదేశమైన పాకిస్థాన్ లో ఉన్న బంధువు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని వాళ్లకు వీసా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఓ యువకుడు విజ్ఞప్తి చేసిన సంఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. బస్తీ బవా ఖేల్ గ్రామానికి చెందిన కమల్ కల్యాణ్ అనే యువకుడు కారు డీలర్‌గా పని చేసేవాడు. కమల్ కల్యాణ్ తండ్రికి ఇద్దరు చెల్లెలు పాకిస్తాన్‌లోని లాహోర్, కాసూర్ ప్రాంతానికి చెందిన వారిని పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయారు. భారత్‌తో పాక్ విడిపోయినప్పుడు కమల్ కల్యాణ్ మాత్రం భారత్‌కు తిరిగొచ్చాడు. ఆయన చెల్లెలు మాత్రం పాక్‌లో ఉండిపోయారు. 2015 వరకు పాక్‌లోని తన బంధువుల ఇళ్లలో శుభాకార్యాలకు వెళ్లి వస్తుండేవాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 10 మంది మృతి


ఇదిలాఉండగా 2015 నుండి పాకిస్థాన్ వెళ్లడానికి ప్రభుత్వం నిషేధం విధించడంతో తన బంధువులను కమల్ తండ్రి కలవలేకపోయాడు. 2018లో తాజాగా కమల్ కల్యాణ్ తండ్రి చెల్లెలు మనవరాలి సుమైళతో కమల్‌కు ఆన్ లైన్లో ఎంగేజ్‌మెంట్ చేశారు. పెళ్లి కోసమని వాళ్లు భారత్ రావాటానికి తీవ్రంగా ప్రయతిస్తున్నప్పటికి వీసా మాత్రం దొరకడం లేదు. దీంతో భారత ప్రభుత్వం వాళ్లకు వీసా ఇప్పిస్తే తాను పెళ్లి చేసుకొని, ఇంటి వాడిని అవుతానని ప్రధాని మోదీకి కమల్ లేఖ రాశాడు. 
Also Read: CBSE board exams results 2020: సీబీఎస్ఈ ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్స్