ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 10 మంది మృతి

Covid19 Cases in Andhra Pradesh: రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 5,196 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 6,147 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10 మంది కరోనాతో మరణించారు.

Updated: Jun 26, 2020, 05:36 PM IST
ఏపీలో భారీగా కరోనా కేసులు.. తాజాగా 10 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్(AP CoronaVirus Cases) కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో 570 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కాగా, మిగతా 35 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (Covid19 Cases in Andhra Pradesh) 11,489కు చేరుకున్నాయి. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 5,196 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 6,147 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 10 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 146 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. హైదరాబాద్‌లో దారుణం.. బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

ఏపీలో గడిచిన 24 గంటల్లో 22,305 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 605 మందికి కోవిడ్19(COVID19) పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 191 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరులో ఒక్కరు, విశాఖ జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో మరణించారు. పొరుగు దేశానికి మద్దుతుగా నిలిచిన అసోం

నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,91,624 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 9,353 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చినవారిలో 1,764 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు గురువారం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ